Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

జీవీఎంసీ ఎన్నికల వేళ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ వాసు నాయుడు

Punnami Newsroom Published:
జీవీఎంసీ ఎన్నికల వేళ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ వాసు నాయుడు

విశాఖపట్నం, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సీఐ వాసు నాయుడు రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టారు.

ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలు, బెదిరింపులు, అల్లర్లకు పాల్పడకూడదని, రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులకు అనుకూలంగా, వ్యతిరేకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జీవీఎంసీ ఎన్నికల వేళ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ వాసు నాయుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *