ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
డాక్టర్ ఎన్‌టి టి పి ఎస్ బూడిద రవాణా టెండర్ వ్యతిరేకంగా స్థానిక లారీ ఓనర్స్ & డ్రైవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. సభ్యులు తమ డిమాండ్లు పరిష్కారం జరిగే వరకు పోరాటాన్ని ఆపదని స్పష్టం చేశారు. కాలుష్య బాధలో ఉన్న తమపై బూడిద కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేయించడం అన్యాయం అని చెప్పారు. 12 కోట్ల రూపాయల కాంట్రాక్టును కేటాయించడం దుర్మార్గమని విమర్శించారు. స్థానికులకు లాభం లేకుండా తీసే నిర్ణయాలపై డాక్టర్ ఎన్‌టి టి పి ఎస్ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు.తమ సమస్యపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు హర్షం వ్యక్తం చేశారు. లారీ, డ్రైవర్, ఓనర్లు మరియు స్థానిక ప్రజలు తమ పోరాటంలో న్యాయం ఉందని, అవసరమైతే నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.


