5వ జోన్ లో నవంబరు 6 న బహిరంగ వేలం
– జివిఎంసి జోనల్ కమిషనర్ బి. రాము.
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 5వ జోన్ పరిధిలోని ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు నవంబరు 6 వ తేదీన ఉదయం 11 గంటలకు 5వ జోన్ (జ్ఞానాపురం) జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని జోనల్ కమిషనర్ బి.రాము గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ, జ్ఞానాపురం, జోన్-5, పరిధిలోని వార్డు నెం.40 నుండి 63 వరకు ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపములు, రోడ్డు సైడ్ మార్కెట్ల కు తేది 06-11-2025 ఉదయం 11.00 లకు జ్ఞానాపురం లో 5వ జోనల్ కార్యాలయము నందు దిగువ తెలిపిన వివరాలు ప్రకారం బహిరంగ వేలము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
వార్డు నెం.60 లో గుల్లల పాలెం షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణము నెం. 22,23,24,28,46,47,57, అశోక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణం నెంబర్ 1,2,3 మరియు ములగాడ షాపింగ్ కాంప్లెక్సు లో దుకాణము నెం.03 , ప్రకాష్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణము నెం.05 , గుల్లల పాలెం హాకర్ జోన్ షాప్ లో బ్లాక్-ఎ లో 1 నుండి 20 షాప్ లకు , బ్లాక్-బి లో 21 నుండి 38 షాప్ లకు మూడు సంవత్సరాల కాల పరిమితి వరకు అలాగే వార్డు నెం 51 (కొత్త వార్డు) లోని మాధవ స్వామి కళ్యాణ మండపం నకు మూడు సంవత్సరాల కాల పరిమితి వరకు, మార్కెట్లలో గుల్లలపాలెం దుకాణము, రోడ్ పక్కన మార్కెట్లకు (హాకర్ మండలం) ఒక సంవత్సరం కాల పరిమితి వరకు వేలం పాట జరుగునని 5వ జోన్ జోనల్ కమిషనర్ తెలిపారు.
కావున ఆసక్తి గల వారు వేలం పాటలో పాల్గొనేటప్పుడు వేలంపాటకు సంబంధించి ధరావత్తు మొత్తం డి.డి రూపంలో తీసుకురావాలని, ఎస్.సి రిజర్వుడు కేటగిరి వారు సంబంధిత కుల ధృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుందని, వేలం పాటలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఆధార్, పాన్ కార్డు కలిగి ఉండాలని, తదుపరి పూర్తి వివరణ కొరకు జోన్-5, జ్ఞానాపురం కార్యాలయము పని దినములలో పర్యవేక్షకులను సంప్రదించవచ్చునని జోనల్ కమిషనర్ తెలియజేశారు

