తూర్పుగోదావరిజిల్లా :
పాసర్లపూడి, కొండాలమ్మ చింత సెంటర్ నందు పెదపట్నం లంక గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన 15 ఏళ్ల యువతిని హోమ్ ఐసోలేషన్ కొరకు పెదపట్నంలంక తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.దీనిని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ధర్నా చేపట్టారు. గత నెల 29వ తేదీన ముంబై నుంచి వచ్చిన నలుగురు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి నెగిటివ్ వచ్చింది. ఒక యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ నలుగురు ప్రస్తుతం రావులపాలెం క్వారంటైన్ లో ఉన్నారు.