వీధి దీపాలు వెలగకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంకల కవిత అప్పారావు యాదవ్
వారం రోజులు గడుస్తున్నపట్టకి అధికారుల నుంచి స్పందన కరువైందని తీవ్ర ఆవేదన వ్యక్త పరిచిన గంకల*
గుడ్ మార్నింగ్ గంకల పిర్యాదు మేరకు వార్డు అంతటా రాత్రి వేళలో ఆకస్మిక పర్యటన చేసిన గంకల
విశాఖపట్నం
సెప్టెంబర్ 9
పున్నమి ప్రతినిధి సూర్య
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డులో జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ
భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు సోమవారం నాడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆకస్మికంగా వార్డులో గల బాపూజీ నగర్,రామకృష్ణ నగర్ ,నీలకంఠ నగర్,శ్రీనివాస్ నగర్,శివలింగ పురం,పల్నాటి కాలనీ,న్యూ శ్రీనివాస్ నగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో పర్యటన చేశారు.ఇందులో భాగంగా గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని అందిన పిర్యాదు మేరకు పలు చోట్ల వెలగని వీధి దీపాల పనితీరును గుర్తించి వాటి పనితీరుపై అసహనం వ్యక్తం చేసారు.వార్డు మొత్తం కొండవాలు ప్రాంతం కావడంతో ప్రతి రోజు పర్యటన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి వీధి దీపాలు వెలగకపోవడం
నిర్లక్ష్యం అవ్వడం పట్ల వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికి పలు మార్లు వీధి దీపాలు వెలగడం లేదని, నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలనీ పిర్యాదు చేసినప్పటికి ఇప్పటివరకు అధికారులు కనీసం పర్యటన కూడా చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.ముఖ్యంగా 255,91,75 కలిగిన ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సుమారు 10 నుంచి 20 వీధి దీపాలు వెలగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎక్కువ లైటింగ్ కొరకు ఏర్పాటు చేసిన రింగ్ పోల్స్ కూడా వెలగకపోవడంతో ప్రజలు ఏ విధంగా చీకటిలో ప్రయాణం చేయాలని ప్రశ్నించారు. కొండ ప్రాంతం మరియు వర్షాకాల పరిస్థితిలో చీకటి ప్రదేశంలో పాములు, కీటకాలు,ఆకతాయిల ఆగడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వార్డులో వీధి దీపాలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో నిరసన చేస్తామని తెలిపారు.ఈ సందర్బంగా గంకల మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని అందిన పిర్యాదు మేరకు వార్డులో పరిశీలన చేసి వీధి దీపాల పనితీరు పై అసహనం వ్యక్తం చేయడం జరిగిందని,ఇప్పటికి రెండు సార్లు ఇటువంటి ఇబ్బంది గమనించడం జరిగిందని,వార్డు మొత్తం కొండవాలు ప్రాంతం కావడంతో ప్రతి రోజు పర్యటన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి వీధి దీపాలు వెలగకపోవడం
నిర్లక్ష్యం అవ్వడం పట్ల వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వృద్ధులు,వికలాంగులు,మహిళలు,పిల్లలు వీధి దీపాలు వెలగకపోవడం పట్ల ఇబ్బందులు పడుతున్నారని,ప్రస్తుత వర్షకాలం దృష్యా కొండవాలు ప్రాంతం కావడంతో విష సర్పాలు,అకతాయిల చేష్టలు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వార్డులో వీధి దీపాలు సమస్యకు పరిష్కారం చూపాలని లేకుంటే ఉన్నత అధికారులకు పిర్యాదు అందిస్తానని,నిరసన చేస్తానని అన్నారు.రాత్రి వేళలో వార్డు ప్రజల సమస్యకు పర్యటన చేసి పరిష్కార దిశగా హామీ ఇచ్చినందుకు వార్డు ప్రజలు గంకల కవిత అప్పారావు పట్ల అభినందనలు తెలిపారు.


