ఖమ్మం ఆగస్టు
( పున్నమి ప్రతి నిధి)
బిసి లకి కేటాయించి న 42 శాతము రిజర్వేషన్ లని బిసి లకే కేటాయించాలి అని ఆలా కాకుండా ముస్లిం లకి 10% కేటాయిస్తే సహాంచేది లేదని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు సుదన్ రావు అన్నారు.
ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తాం, బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా 20 వేల కోట్లు కేటాయిస్తాం, బీసీ బిడ్డలు వ్యాపారం చేసుకోవడం కోసం కానీ చదువు కోసం కానీ 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిందని, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరము పైగా అవుతున ఇంకా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తుందని మండి పడ్డారు
కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని,
అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ అబద్దాలను నమ్మి మోసపోయిన బీసీ బిడ్డలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని ఆదరిస్తారని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.


