*36వ వార్డులో జామియా మసీదును సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*మసీదు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే*
*ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మసీదు నిర్మాణం ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయడంజరిగిందని తెలిపిన ఎమ్మెల్యే*
*ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఘన స్వాగతం పలికిన మసీద్ పెద్దలు, యువత*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
జామియా మసీద్ పునర్నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మసీదు పెద్దలు, యువత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం మసీదు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన వక్ బోర్డు వారికి మరియు మసీదు కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. తాను మాటమీద నిలబడే మనిషినీ అని, ఇచ్చిన హామీని నెరవేర్చడం తన బాధ్యతగా స్వీకరిస్తారని మరొకసారి తెలియజేశారు . విశాలమైన ప్రాంతంలో సుందరమైన మసీదు నిర్మాణం చేపట్టడం జరిగింది అని అన్నారు. అనంతరం మసీదు కమిటీ రెన్యువల్ కాపీని అందజేశారు. చివరిగా గార్విషరీఫ్ లో పాల్గొని విందు స్వీకరించారు. కార్యక్రమంలో వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్, మసీద్ అధ్యక్షులు అక్బర్ బాషా మరియు పెద్దలు షరీఫ్ , రహమతుల్లా, షకీల్ , సలీం మరియు స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి మాసిపోగుమేరీ జాన్స్ రాజుగారు, నియోజవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జీకే గారు, జనసేన యువజన విభాగం నేత శ్రీ శివ గణేష్ గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు..


