*35వార్డులో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు పంపిణి
*మెంథా తుఫాను నేపథ్యంలో
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!*
* *వర్షాన్ని లెక్కచేయకుండా సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే “వాసుపల్లి* ”
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
మెంథా తుఫాను నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు దక్షణ ప్రజలందరూ అప్రమత్తమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. *వార్డ్ అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి, వార్డ్ సీనియర్ నాయకులు సమక్షంలో 35వ వార్డు లక్ష్మీ నగర్ లోతట్టు ప్రాంత ప్రజలకు సుమారు 250 కుటుంబాలకు రూ. 500 విలువచేసే నిత్యవసర వస్తువులను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వర్షం లెక్కచేయకుండా తడుస్తూ పేదలకు సాయం అందించారు.* ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బలమైన ఈదురు గాలులతో ముంచుకొస్తున్న మెంథా తుఫాను తీరం దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిత్య అవసరాలకు ఇంటి నుండి బయటకు రాకూడదనే ఉద్దేశంతో మూడు కేజీల బియ్యం, కూరగాయలు, వంట నూనె, మాంసం అందజేస్తూ ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. రాజకీయం చేసే ఉద్దేశం తముకు లేదని, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణంలో ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రజలకు సాయం అందించడంలో ముందుంటామన్నారు. తుఫాన్ లో ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం పిలుపునిస్తే రాజకీయానికి అతీతంగా వైఎస్ఆర్సిపి నాయకులంతా సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వాసుపల్లి తెలిపారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు అందరికీ 50 కేజీల బియ్యం తో పాటు రేషన్ ఉచితంగా ప్రభుత్వం అందించాలని ఓ మత్స్యకారుడుగా డిమాండ్ చేస్తున్నట్లు వాసుపల్లి తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి సహాయం కావాలన్నా తనని సంప్రదిస్తే సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రటరీ అభిరెడ్డి అడివిషు,మాజీ కార్పొరేట్ పచ్చిరపల్లి రాము,సౌత్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సువార్త రాజు, సౌత్ అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు మల్ల విజయ్, జీరు సుధా, గంగాధర్, రావణమ్మ, వినోద్,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, రాజా రెడ్డి, ముత్తబాతులు రమేష్, ఏరిమామ్మ గుడి చైర్మన్ లండ రమణ,లింగం శ్రీను,గంగళ రామరాజు, వైస్సార్సీపీ జిల్లా మరియు స్టేట్, సౌత్ అనుబంధ సంఘాల నాయకులు బేవార మహేష్,దుద్దా అప్పారావు,అరుగుల రాజు, చోడిపిల్లి శివ,సాగర్,గాలి పార్వతి, చేపల నూకరాజు బుడ్డి,పిల్లి సత్తిబాబు, జ్యోతి, కొనతాల కృష్ణవేణి,లక్ష్మణ్,సత్య,వెంకటి,చేపల ప్రసాద్,సత్తిరాజు, జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


