విశాఖ క్రీడాకారులు తమ ప్రతిభను విశ్వవ్యాప్తంగా చాటాలి!
పోస్టర్ ను విడుదల చేసిన
ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్!

విశాఖపట్నం, అక్టోబర్, 11:
ఈనెల 26న పోలీస్ బేరక్స్ గ్రౌండ్స్ లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వెటరన్ అథ్లెటికక్స్ ఛాంపియన్షిప్ – 2025″ పోటీలను “వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం” (VAAV) నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో శివాజిపాలెంలోని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయంలో శనివారం గోడ పత్రిక ను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్’ చైర్మన్ డాక్టర్ కమల్ బయిద్, వావ్ అధ్యక్షులు డాక్టర్ మంగ వరప్రసాద్, పీఆర్ఓ చింతలపాటి వంశీ కృష్ణ వర్మ ,కోశాధికారి ఎం. రామారావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులే కాకుండా 30 సం.రాల వయసు దాటిన ఔత్సాహిక క్రీడాకారులెవరైనా ఈ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి విశాఖకీర్తి ప్రతిష్టలు విశ్వ వ్యాప్తంగా చాటాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ట్రస్ట్ చైర్మన్ , వావ్ చీఫ్ పేటర్న్ డా. కమల్ బయిద్ మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభా క్రీడాకారులను ఆదుకోడానికి ప్రత్యేక క్రీడానిధిని ఏర్పాటు చేస్తూ వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ ‘ స్థాపించామన్నారు. వావ్ అసోసియేషన్ అధ్యక్షులు డా. మంగ వరప్రసాద్ ప్రసంగిస్తూ 5 కి.మీ.వాకింగ్ , 100, 200, 400, 800, 1500, 5000 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్ , లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, హేమర్ త్రో తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. 30-34 వయసు నుండి ఆ పైబడి వయస్సు గల స్త్రీ , పురుషులకు వేరు,వేరుగా పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు
స్వర్ణ,కాంస్య ,రజిత పతకాలను, పశంసా పత్రాలను అందించి గౌరవిస్తామన్నారు.ఈ పోటీలలో పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాలు గెలుపొందిన క్రీడాకారులను డిసెంబర్ 13,14 తేదీలలో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
ఈ పోటీలలో పాల్గొనే వారంతా పోలీస్ బేరక్స్ గ్రౌండ్ లో ఈనెల 26వ తేదీ నాటి ఉదయం 6గం.లకే చేరుకోవాలని, ఈ నెల 20వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, క్రీడాకారులందరికీ మంచి నీరు, అల్పాహారం, భోజనాది ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వివరములు కొరకు 9701347311, 83091 57522 ఫోన్ నెంబర్స్ ను సంప్రదించ వలసినదిగా కోరారు.

