పున్నమి ప్రతినిధి
2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ప్రధాన స్రవంతిలో కలవడానికి కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి వారు వినతిపత్రం పంపిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత పార్టీ బలహీనపడింది. మిగిలినవారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.


