*ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలో*
*1977 -78 10,వ తరగతి పూర్వ విద్యార్థుల… అపూర్వ సమ్మేళనం..*
*పున్నమి ప్రతినిధి పెబ్బేర్ వనపర్తి జిల్లా తేదీ 22/ 12/ 20205*
*దాదాపు 70 వసంతాల వయసులో కూడా 1977 -78 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెబ్బేరు, వనపర్తి జిల్లా యందు జరుపుకోవడం ఆనందదాయకమని నిర్వాహకులు తెలిపారు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చదువు చెప్పిన చదువులమ్మ ఒడి గుడి బడి అయినటువంటి ఇక్కడ కలవడం చాలా ఆనందదాయకమని పూర్వ విద్యార్థులు సరళ, హైమావతి, కల్పలత, జి చెన్నమ్మ తెలియజేశారు, కొద్ది బుద్ధిని కృష్ణయ్య, హేమ సుందర్ రెడ్డి, అప్సర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు*


