ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి)
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ గేయ పూజిత తెలిపారు. బుధవారం మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 సంవత్సరాలు పూర్తై 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోని బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. మండలంలో 191 మందిని గుర్తించి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టిడిపి నాయకులు రాయపాటి కిరణ్, వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

191 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్న ఆరోగ్య శాఖ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ గేయ పూజిత తెలిపారు. బుధవారం మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 సంవత్సరాలు పూర్తై 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోని బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. మండలంలో 191 మందిని గుర్తించి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టిడిపి నాయకులు రాయపాటి కిరణ్, వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

