చిట్వేలి, సెప్టెంబర్: 26 (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంగరంగ వైభవంగా మెగా డీఎస్సీ ఉత్సవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ నుండి సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా 7 బస్సులు కేటాయించగా, ప్రజల ఉత్సాహ నినాదాల మధ్య కార్యక్రమం ప్రారంభమైంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేసి, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి, వాగ్దానాన్ని నెరవేర్చారని కూటమి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా పాల్గొని, చిట్వేలు మండలానికి చెందిన పలువురికి నియామక పత్రాలను అందజేశారు. సభా ప్రాంగణం ఆనందోత్సాహాలతో మార్మోగింది


