Thursday, 26 March 2026

ఉక్కు కార్మికుల సమస్యలను పరిష్కరించండి . __ ఇంటక్ విజ్ఞప్తి . విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్ ఇంటక్ ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ప్లాంట్ జనరల్ మేనేజర్ ( హెచ్.ఆర్) ఎన్. బాను కు ఇంటక్ ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది . ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజ శేఖర్ , స్టీల్ ఇంటక్ అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం నిర్దేశించిన మేరకు ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకల్లో భాగస్వాములై కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కులో మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉందని , తద్వారా ఉక్కు ఉద్యోగులపై పని బారం పెరిగిందని అన్నారు . తక్షణమే మ్యాన్ పవర్ పెంచాలని , మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల కార్మికులు సెలవులు వాడటం లేదని అన్నారు. ఈ సమస్య వల్ల ఈ ఎల్స్ వాడటం లేదని అన్నారు. ఈ ఎల్ ఎన్క్యాష్మెంట్ కు అవకాశం ఇస్తే ఉద్యోగుల పిల్లలకు స్కూల్ ఫీజు లు , ఇతర అవసరాలకు ఉపయోగ పడతాయని అన్నారు .ఈ ఎల్స్ అధికారులకు మాదిరిగా 200 లీవ్స్ నుండి 300 లీవ్స్ ఇచ్చినట్లయితే కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము ప్రసాద్ , సీనియర్ నాయకులు నడుపూరు వెంకన్న ,కోరిబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు కార్మికుల సమస్యలను పరిష్కరించండి .

__ ఇంటక్ విజ్ఞప్తి .

విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్ ఇంటక్ ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ప్లాంట్ జనరల్ మేనేజర్ ( హెచ్.ఆర్) ఎన్. బాను కు ఇంటక్ ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది . ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజ శేఖర్ , స్టీల్ ఇంటక్ అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం నిర్దేశించిన మేరకు ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకల్లో భాగస్వాములై కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కులో మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉందని , తద్వారా ఉక్కు ఉద్యోగులపై పని బారం పెరిగిందని అన్నారు . తక్షణమే మ్యాన్ పవర్ పెంచాలని , మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల కార్మికులు సెలవులు వాడటం లేదని అన్నారు. ఈ సమస్య వల్ల ఈ ఎల్స్ వాడటం లేదని అన్నారు. ఈ ఎల్ ఎన్క్యాష్మెంట్ కు అవకాశం ఇస్తే ఉద్యోగుల పిల్లలకు స్కూల్ ఫీజు లు , ఇతర అవసరాలకు ఉపయోగ పడతాయని అన్నారు .ఈ ఎల్స్ అధికారులకు మాదిరిగా 200 లీవ్స్ నుండి 300 లీవ్స్ ఇచ్చినట్లయితే కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము ప్రసాద్ , సీనియర్ నాయకులు నడుపూరు వెంకన్న ,కోరిబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.