గిరిజన ప్రాంతాల్లో హోం స్టేలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం
తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో హోం స్టేలను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. కలెక్టర్ కీర్తి చెక్కూరి వివరాల ప్రకారం, కొత్తగా హోం స్టేలు ప్రారంభించే వారికి రూ.5 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇప్పటికే పునరుద్ధరణ పనులు చేపట్టే వారికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఏడు సంవత్సరాలపాటు 100 శాతం SGST మినహాయింపు ఇవ్వబడుతుందని ఆమె తెలిపారు. తొలి మూడు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ రాయితీలు కొనసాగుతాయి. యజమానులు తమ హోం స్టేలను అదే ప్రాంగణంలో కొనసాగించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

