Thursday, 12 February 2026

కొత్తకోడూరులో గిరిజన కాలనీ పర్యటన – బొబ్బేపల్లి సురేష్ నాయుడు తోటపల్లి గూడూరు (ప్పున్నమి ప్రతినిది అక్టోబర్స 25):-సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — రాబోయే మూడు రోజుల పాటు మంతా తుఫాన్‌కి సంబంధించి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిజనులను కాపాడడంలో, వారికి సమాజంలో మంచి స్థానం కల్పించడంలో ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థను ప్రజల సేవకోసం కాకుండా, పార్టీ ప్రచార కార్యక్రమాలకోసం వినియోగించిందని బొబ్బేపల్లి విమర్శించారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడంలో ఎలాంటి కృషి జరగలేదని ఆయన అన్నారు. “సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ఆయన కుమారుడు గురించి మాత్రమే మాట్లాడే కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఏమీ చేయలేదు. పేద గిరిజన పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చిన ఆనవాళ్లు లేవు. అలాంటి వ్యక్తికి సోమిరెడ్డిని విమర్శించే అర్హత లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పామంజి శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోడూరులో గిరిజన కాలనీ పర్యటన – బొబ్బేపల్లి సురేష్ నాయుడు

తోటపల్లి గూడూరు (ప్పున్నమి ప్రతినిది అక్టోబర్స 25):-సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — రాబోయే మూడు రోజుల పాటు మంతా తుఫాన్‌కి సంబంధించి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిజనులను కాపాడడంలో, వారికి సమాజంలో మంచి స్థానం కల్పించడంలో ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్
రెడ్డేనని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థను ప్రజల సేవకోసం కాకుండా, పార్టీ ప్రచార కార్యక్రమాలకోసం వినియోగించిందని బొబ్బేపల్లి విమర్శించారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడంలో ఎలాంటి కృషి జరగలేదని ఆయన అన్నారు.

“సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ఆయన కుమారుడు గురించి మాత్రమే మాట్లాడే కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఏమీ చేయలేదు. పేద గిరిజన పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చిన ఆనవాళ్లు లేవు. అలాంటి వ్యక్తికి సోమిరెడ్డిని విమర్శించే అర్హత లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పామంజి శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.