విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
14,15 తేదీలలో నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న CII partnership సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.*
CII partnership సమ్మిట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవంతముగా పూర్తి కావడానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది.
నగరానికి విచ్చేయనున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు మరియు ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు అధికారులు మరియు సిబ్బందితో నిరంతర నిఘాతో, నగర ప్రజల భద్రతతో పాటుగా నగరానికి వచ్చు విదేశీ ప్రతినిధులకు, వి.ఐ.పిలకు, సదస్సులకు పూర్తి భద్రతా చర్యలు చేపట్టమైనది.
నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటల్స్ లో, లాడ్జీలలో,రిసార్టులలో,గెస్ట్ హౌస్ లలో నగర పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు
ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వద్ద గల సదస్సు ప్రాంగణం వద్దా , హెలిపాడ్ ల వద్దా మరియు సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించే హోటళ్ల వద్దా స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలీస్తున్నారు.
సదస్సుకు వచ్చే ప్రతినిధులు, వి.ఐ.పిలు ప్రయాణించు రహదారులూ, సదస్సు వద్దా పూర్తి నిఘాతో ఏ.ఎస్.సి ,ఆర్.ఓ.పి లను నిర్వహిస్తున్నారు.
బందోబస్తును పలు కేటగిరిలుగా విభజించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించడం జరిగినది.
నగరంలో ముఖ్య ప్రాంతాలలో పికెట్స్,గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది.
నగర కమిషనర్ గారు పలు శాఖల నగర అధికారులతో పాటూ, రాష్ట్రఅధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ భద్రతా మరియు ఇతర ఏర్పాట్లను చర్చిస్తున్నారు.
ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో సదస్సు చుట్టూ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగినది.
ఆర్.ఓ.పి లు,ఏ.ఎస్.సి టీంలతో నగరంలో వి.ఐ.పి లు, సదస్సుకు వస్తున్న ప్రతినిధులు ప్రయాణిస్తున్న రహదారులను అనుక్షణం తనిఖీలు చేయడం జరుగుతుంది.
ట్రాఫిక్ డైవర్సన్స్ పై పత్రిక ప్రకటన
తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో 30వ భారత పరిశ్రమల సమాఖ్య (CII SUMMIT-2025) నిర్వహించబడుతున్నది. ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు,ఉపముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖా మాత్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరియు 40 దేశాల నుండి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. కావున ఈ సదస్సు దృష్ట్యా విశాఖ నగరవాసులు, సాధారణ వాహనదారులు ఈ క్రింది సూచనలు పాటించవలసిందిగా విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్ వారు తెలియజేస్తున్నాము.
సిటీ డైవర్షన్స్:
మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ జంక్షన్ నుండి మద్దిలపాలెం ఆర్చ్ వరకు ఇరువైపులా సాధారణ వాహనదారులకు తేదీ 12.11.2025 నుండి 16.11.2025 వరకు ఎటువంటి అనుమతి లేదు.
విశాఖ కంటి ఆసుపత్రి (Visakha Eye Hospital) జంక్షన్ నుండి సిరిపురం వైపు వచ్చు సాధారణ వాహనదారులు తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో విశాఖ కంటి ఆసుపత్రి జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని శివాజీ పాలెం మీదుగా హైవేకు చేరుకొని తమ గమ్యస్థానాలను చేరుకొనవలెను.
సిరిపురం జంక్షన్ నుండి మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ వైపు వచ్చు సాధారణ వాహనదారులు టైకూన్ జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకుని మాస్క్ జంక్షన్ మీదగా తమ గమ్య స్థానాలను చేరుకొనవలెను.
నగరంలో కొన్ని ముఖ్యమైన హోటల్స్ అనగా Novotel, Grand Bay, Radission Blu, Green park, Four Points by Sheroton, భీమిలి Novotel, థ పార్క్ మరియు ఆయా హోటల్స్ నుండి సదస్సు (AU గ్రౌండ్స్) వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఎన్టీఆర్ భవనం వరకు VIP లు వచ్చే సమయంలో వారి బధ్రత సౌలబ్యం దృష్ట్యా VIP లు ప్రయాణించే రోడ్డుకు ఆనుకొని ఉన్న ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్ లలో కొద్ది సమయం ట్రాఫిక్ ని నిలుపుదల చేయవలసిన అవసరము ఏర్పడుతుంది. కావున ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొనవలసిందిగా తెలియజేయడమైనది. అలాగే VVIP ప్రయాణించే రోడ్లలో వాహనాలను అక్రమoగా నిలుపుదల (Wrong Parking) చేయకూడదని తెలియజేయడమైనది.
II. హైవే డైవర్షన్స్
తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో నగరంలో అంతర్జాతీయ, జాతీయ స్తాయి ప్రముఖుల పర్యటనలు ఉన్నందున వారి భద్రత దృష్ట్యా ఆ రెండు రోజులు శ్రీకాకుళం, విజయనగరం నుండి అనకాపల్లి వైపు వెళ్ళు అన్ని రకాల భారీ వాహనాలు( పోర్టు వాహనాలు సహా) ఆనందపురం జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని పెందుర్తి,సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవలెను
అనకాపల్లి నుండి శ్రీకాకుళం విజయనగరం వైపు వెళ్ళు భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం చేరుకొనవలెను
III పార్కింగ్ ప్రదేశములు:
కేంద్ర మంత్రివర్యులకు సంబంధించిన వాహనాలు సిరిపురం, రూరల్ SP బంగ్లా రోడ్డు ద్వారా సదస్సుకు చేరుకొని వేదిక ముందు వైపున గల alighting point వద్ద VVIP ని దించి, YVS మూర్తి ఆడిటోరియం ముందర గల VVIP పార్కింగ్ ప్రదేశము (A-1 పార్కింగ్) లో వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను.
సీనియర్ IAS, IPS అధికారుల వాహనాలు YVS Murthy Auditorium ప్రక్కనగల VVIP Parking(Parking Place -B) లో పార్కింగ్ చేసుకొనవలెను.
VIP Protocol delegates వాహనాలు, రాష్ట్ర మంత్రివర్యుల వాహనాలు సిరిపురం, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ ద్వారా సదస్సు వద్దకు చేరుకొని వేదిక ముందు వైపున గల alighting point వద్ద VVIP ని దించి, YVS మూర్తి ఆడిటోరియం ప్రక్కన గల VVIP పార్కింగ్ ప్రదేశము (A-3 పార్కింగ్)లో వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను.
Novotel, Grand Bay, Green Park, Four Points by Sheraton, Marriott మొదలగు హోటల్స్ నుండి వచ్చిన VIP Passes కలిగిన delegates మరియు MPs, MLsC, MLsA, వాహనాలు అన్నియు, సిరిపురం గుండా 3వ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ గుండా వెళ్లి సదస్సు వేదిక ముందు వైపున గల VIP alighting point వద్ద VIP ని దించి AU College ‘B”గ్రౌండ్ లో వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశoలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను
భీమిలి నోవాటేల్, రాడిసన్-బ్లూ, పార్క్ హోటల్ నుండి వచ్చే VIP Passes కలిగిన delegates వాహనాలు అన్నియు అరుకు కాఫీ జంక్షన్ వద్ద టర్న్ తీసుకోని , గవర్నమెంట్మెంటల్ హాస్పిటెల్ రోడ్ నుండి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ గుండా వెళ్లి సదస్సు వేదిక ముందు వైపున గల VIP alighting point వద్ద VIP ని దించి AU బి గ్రౌండ్ లో వారికి నిర్దేసించిన పార్కింగ్ ప్రదేశoలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకొని సదస్సుకు హాజరు కావలెను.
సిరిపురము వైపు నుండి మరియు పోలమాంబ గుడి వైపు నుండి వచ్చే delegates వారి యొక్క వాహనాలు, పోలమాంబ గుడి దగ్గరలో గల, ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లోనికి ప్రవేశించి, “B” గ్రౌండ్లో గల alighting point వద్ద delegates దింపి, వారి యొక్క వాహనాలను “B” గ్రౌండ్లో (D-1 పార్కింగ్ స్థలం) పార్కింగ్ చేసుకొనవలెను. ఈ B గ్రౌండ్లో వాహనాలు నిండిన యెడల, వారి యొక్క వాహనాలను న్యూటన్ హాస్టల్ ఎడమ వైపున గల పార్కింగ్ ప్రదేశము (D-3) నందు గాని, న్యూటన్ హాస్టల్ వెనుక వైపున గల పార్కింగ్ ప్రదేశము (D-4) నందు గాని, సమత హాస్టల్ ముందర గల పార్కింగ్ ప్రదేశము (D-5) నందు గాని, మెటా హాస్టల్ ముందర గల పార్కింగ్ ప్రదేశము (D-6) నందు గాని వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.
అలాగే మద్దిలపాలెం Arch నుండి వచ్చిన Deligates యొక్క వాహనాలు B ground లొ ప్రవేశించి B Ground Alighting Point వద్ద deligates ను దించి B Ground లొ పార్కింగ్ (D-1) చేసుకొనవలెను. ఈ B గ్రౌండ్లో వాహనాలు నిండిన యెడల, వారి యొక్క వాహనాలను పిఠాపురం కాలనీ గెట్ పార్కింగ్ ప్రదేశము (D-2) నందు వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.
పోలీసు, రెవెన్యూ, GVMC మరియు ఇతర ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల వాహనాలన్నియు హెలిపాడ్ గ్రౌండ్ కు ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో(Parking Place-C) పార్కింగ్ చేసుకొనవలెను.
ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ సందర్భంగా విశాఖపట్నం నందు వాహనాల తనిఖీ ( Vehicle Checking) ఉధృతం చేయడమైనది. కావున నగర ప్రజలు ఏమైనా అనుమానాస్పద (Unclaimed / abandoned) వాహనాల సమాచారం పోలీసులకు తెలియ చేయవలసిందిగా కోరడమైనది మరియు పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైనది.
విశాఖనగరం నందు తే.12-11-2025 దీ నుండి తే.15-11-2025 దీ వరకు డ్రోన్లు ఎగురవేయడం నిషేధించడమైనది. ఎవరైనా డ్రోన్లు ఎగరవేసినచో వారి యొక్క డ్రోన్లు సీజ్ చేసి చట్టరిత్యా చర్య తీసుకోబడును.
పై తేదీలలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రత దృష్ట్యా పై ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. కావున, పైన తెలిపిన సూచనలు పాటించి ప్రజలు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడమైనది.


