Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న NBW నిందితుడి అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న NBW నిందితుడి అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బిట్రగుంట: బిట్రగుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన Cr.No.106/2012 U/s 304-B IPC & Sec.3 & 4 DP Act కేసులో గత 14 సంవత్సరాలుగా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) నిందితుడిని…
  • గౌరవ న్యాయస్థానం జారీ చేసిన NBW మేరకు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు.
  • నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ పర్యవేక్షణలో బిట్రగుంట ఎస్సై మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బిట్రగుంట: బిట్రగుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన Cr.No.106/2012 U/s 304-B IPC & Sec.3 & 4 DP Act కేసులో గత 14 సంవత్సరాలుగా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) నిందితుడిని బిట్రగుంట పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గౌరవ న్యాయస్థానం జారీ చేసిన NBW మేరకు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కావలి డీఎస్పీ పర్యవేక్షణలో బిట్రగుంట ఎస్సై మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారెంట్లను అమలు చేయడంపై బిట్రగుంట పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, వారెంట్ల అమలుకు నిరంతరం చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న NBWను అమలు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో చురుకైన చర్యలు చేపట్టిన బిట్రగుంట పోలీసులను అధికారులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *