Story highlights
- నర్రవాడ: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ పునర్నిర్మాణ పనులకు నవంబర్ 1న శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తెలిపారు.
- మంగళవారం నర్రవాడలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తొలి దశలో రూ.6 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
- రెండో దశలో మరో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.
నర్రవాడ: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ పునర్నిర్మాణ పనులకు నవంబర్ 1న శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తెలిపారు. మంగళవారం నర్రవాడలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తొలి దశలో రూ.6 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. రెండో దశలో మరో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణం భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజ్ఞప్తి చేశారు.