*14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రాక*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఈ నెల 14వ తేదీన ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుండి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి ఇంజనీరింగ్ గ్రౌండ్ లో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.55 గంటలకు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగ చేరుకొని అక్కడ నుండి ఢిల్లీ బయలుదేరి వెళతారు.
ఈమేరకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ,ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్ సింగ్,జాయింట్ కలెక్టర్,మయూర్ అశోక్,ఇతర ఉన్నత అధికారులు yvs మూర్తి ఆడిటోరియం లో ఏర్పాట్లపై సమీక్ష చేశారు.ఉప రాష్ట్రపతి పర్యటనకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు , పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమావేశం లో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

