13 బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం – కొరికాన రవికుమార్ ముందడుగు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల్లో మరణించిన 13 మంది బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ తన “కొరికాన ఫౌండేషన్” ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
జనసేన సభ్యత్వ గడువు ముగిసిన తరువాత ప్రమాదాలకు గురైన ఈ బాధిత కుటుంబాలకు బీమా అందని పరిస్థితుల్లో సహాయం చేయాలని రవికుమార్ ముందుకు రావడం విశేషం.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన బాధితుల కుటుంబాలకు ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు, పీవోసీలు పాల్గొన్నారు.

13 బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం – కొరికాన రవికుమార్
13 బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం – కొరికాన రవికుమార్ ముందడుగు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల్లో మరణించిన 13 మంది బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ తన “కొరికాన ఫౌండేషన్” ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వ గడువు ముగిసిన తరువాత ప్రమాదాలకు గురైన ఈ బాధిత కుటుంబాలకు బీమా అందని పరిస్థితుల్లో సహాయం చేయాలని రవికుమార్ ముందుకు రావడం విశేషం. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన బాధితుల కుటుంబాలకు ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు, పీవోసీలు పాల్గొన్నారు.

