శ్రీకాళహస్తి:కార్మికులు, ఉద్యోగుల చట్టబద్ధ హక్కు 8 గంటల పని దినాన్ని 13 గంటలుగా మార్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.13గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక,ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయనీ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దాసోహం అయ్యాయి అనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు.కార్మికులను కట్టు బానిసలుగా మార్చే13గంటల పని విధానంపై కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపశమహరించుకోకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

13 గంటలు వద్దు-8 గంటలే ముద్ద:సీఐటీయూ