శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సేవకు కట్టుబడి, రైతుల అభ్యున్నతిని ధ్యేయంగా పెట్టుకున్న నాయకుడిగా పేరుగాంచిన రంగినేని చెంచయ్య నాయుడు డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, కమిటీ డైరెక్టర్లుగా సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకను శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ యార్డ్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది ఇప్పటికే మార్కెట్ యార్డ్ పరిసరాలు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లతో మొదలైయిన సందడి. రైతులు,కార్యకర్తలు,ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
రైతు మార్కెట్ అభివృద్ధి, పారదర్శక పాలన, రైతులకు మెరుగైన సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని చెంచయ్య నాయుడు ఇటీవల పేర్కొన్న విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
కార్యక్రమం ప్రత్యేకత
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, రాష్ట్ర స్థాయి నేతలు, పార్లమెంట్ సభ్యులు హాజరవ్వడం ఈ వేడుకకు మరింత ప్రతిష్టను తెచ్చింది.
ప్రజలందరికీ ఆహ్వానం
ఈ ప్రత్యేక సందర్భానికి తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, రైతులు, మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్లు రంగినేని చెంచయ్య నాయుడు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, రైతు సంక్షేమం, మార్కెట్ నడతలో కొత్త మార్పుల దిశగా ఈ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
ఒక కొత్త ప్రస్థానo
డిసెంబర్ 13న జరగబోయే ఈ ప్రమాణస్వీకారం కేవలం ఓ కార్యక్రమమే కాదు శ్రీకాళహస్తి మార్కెట్ వ్యవస్థలో కొత్త దిశ, కొత్త ఆశలు, కొత్త నాయకత్వం ప్రారంభమయ్యే క్షణంమని ఈ చరిత్రాత్మక వేడుకలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని చెంచయ్య నాయుడు అందరినీ ఆహ్వానిస్తున్నారు.


