
శ్రీకాకుళం జిల్లాలో డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన కర్రసాము పోటీలలో నరసన్నపేట మండలానికి చెందిన బొమ్మాలి కగేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే, ఆయన శిక్షణనిచ్చిన చిన్నారులు వజ్రోత్సవ మెడల్స్‌ను అందుకున్నారు. ఈ అవార్డులను డి ఆర్ డి ఓ ప్రతినిధులు ఘనంగా బహూకరించారు.ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ ప్రతినిధులు మాట్లాడుతూ, “పేద, ధనిక తేడా లేకుండా అందరికీ అన్ని విధాలా శిక్షణ ఇస్తున్న బొమ్మాలి కగేశ్వరరావు సేవలు ప్రశంసనీయమైనవి. ఆయనకు తోడ్పాటునందిస్తున్న రిటైర్డ్ ఆర్మీ సురపు సురేష్ గారు కూడా జిల్లాకి గర్వకారణం” అన్నారు.ఇకముందు కూడా ఇలాంటి సేవలను కొనసాగించి, మరిన్ని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని బొమ్మాలి కగేశ్వరరావు మరియు సురపు సురేష్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, పోటీలు విజేతలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

