నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హాజరుకానున్నారు.


