Friday, 27 March 2026
  • Home  
  • రక్షాబంధన్ సందర్భంగా సోదరి కిడ్నీ దానం – ఆదర్శంగా నిలిచిన తిరుపతమ్మ
- ఆంధ్రప్రదేశ్

రక్షాబంధన్ సందర్భంగా సోదరి కిడ్నీ దానం – ఆదర్శంగా నిలిచిన తిరుపతమ్మ

శ్రీకాకుళం: రక్షాబంధన్ పర్వదినం సోదర–సోదరీల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. ఈ బంధానికి ఆదర్శంగా నిలిచే సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. నరసన్నపేట మండలం బడ్డవానిపేటకు చెందిన తిరుపతమ్మ, తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకు కిడ్నీలు పనిచేయకపోవడంతో, తన కిడ్నీలో ఒకదానిని దానం చేసింది.2011లో ప్రసాదరావు కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులెవరైనా కిడ్నీ దానం చేస్తేనే ఆయన ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు సూచించగా, తిరుపతమ్మ ముందుకు వచ్చి దానం చేసింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రసాదరావు భార్యా పిల్లలతో సుఖంగా జీవిస్తున్నాడు. ఈ సంఘటన రక్షాబంధన్ స్ఫూర్తిని ప్రతిబింబించే ఉదాహరణగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.