నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):
నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.


