*అమరావతి:* మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సోమవారం విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 13 నుంచి 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 వరకూ పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60, వయసు నిర్ధారణ రుసుము రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పైన పేర్కొన్న గడువు తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తే తర్వాతి పని దినాన్ని గడువు తేదీగా పరిగణి స్తారు. https://bse.ap.gov.inలో అందుబాటులో ఉన్న పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే విద్యార్థులు ఫీజు చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ లేదా బ్యాంకు చలాన్ల ద్వారా చెల్లింపులను అంగీకరించరు.
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు