పున్నమి Daily న్యూస్
ప్రతినిధి: T.Ravinder
ఖమ్మం
🚩సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్న సందర్భంగా ది:13-09-2025వ తారీకున రాష్ట్రవ్యాప్తంగా నిజాం కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, నిజాం నిరంకుశ రజాకార్ల చేతుల్లో ప్రాణాలు అర్పించిన అనేకమంది యోధుల స్మారక స్తూపాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా…..
1)ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సుబ్లేడ్ గ్రామంలో నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాం పాలనను వ్యతిరేకంగా వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజలను చైతన్య పరిచిన షోయబుల్లా ఖాన్ గారి జన్మస్థలమైనటువంటి సుబ్లేడ్ గ్రామంలో వారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం. ఉదయం 10:00 గంటలకు.
2) విలేకరుల సమావేశం ఖమ్మం కోణార్క్ హోటల్ నందు మధ్యాహ్నం 12:00 గంటలకు.
3) ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జమలాపురం కేశవరావు గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం సాయంత్రం 3:00 గంటలకు కలదు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా తెలంగాణ విమోచన దినోత్సవ రాష్ట్ర కన్వీనర్ MLC అంజి రెడ్డి గారు , జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు గారు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు, మరియు స్వాతంత్ర సమరయోధులు, గ్రామ ప్రజలు, పాల్గొంటారు కావున.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు అందరూ తప్పకుండా పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి.🙏
ఇట్లు.
ఖమ్మం జిల్లా అధ్యక్షులు
నెల్లూరు కోటేశ్వరరావు గారు
సేవా పక్షం ఖమ్మం జిల్లా కన్వీనర్
అల్లిక అంజయ్య గారు కో కన్వీనర్స్
జిల్లా ఉపాధ్యక్షరాలు మంద సరస్వతి గారు,నల్లమాస్ శ్రీనివాస్ గారు, దూద్దుకూరి కార్తీక్ గారు, రాఘవ గారు
సూచన: రాష్ట్ర, జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,మండల నాయకులు ఉదయం 9 గంటలకి పాలేరు చేరుకోవలెను,అక్కడ వారికి స్వాగతం పలికి పాలేరు నుంచి నరసింహుల గూడెం రోడ్డు మీదుగా సుబ్లేడు చేరుకుంటాము..

