పున్నమి ప్రతి నిధి
మూడు విడతల్లో గ్రామపంచాయతీ పోలింగులు — ఈరోజు నుంచే కోడ్ అమలు
హైదరాబాద్ :
తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసారి ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరంగానే అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) వెంటనే అమల్లోకి వచ్చింది.
ఖమ్మం జిల్లా లో ఎన్నికల నిర్వహణ వివరాలు:
విడతల వారీగా ఎన్నికలు
మొదటి విడత — డిసెంబర్ 11
వైరా, కొణిజర్ల మండలాల్లో పోలింగ్ జరుగనుంది.
రెండవ విడత — డిసెంబర్ 14
కామేపల్లి మండలంలో ఎన్నికలు.
మూడవ విడత — డిసెంబర్ 17
కారేపల్లి, ఏన్కూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది.
మొదటి విడత నవంబర్ 27 డిసెంబర్ 11
రెండవ విడత నవంబర్ 30 డిసెంబర్ 14
మూడవ విడత డిసెంబర్ 3 డిసెంబర్ 17
పోలింగ్ & లెక్కింపు వివరాలు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్
పోలింగ్ రోజు సాయంత్రం నుంచే కౌంటింగ్
నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు, అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. మండలాలవారీగా పోటీ ఉత్కంఠ రేకేతిస్తుంది.


