Monday, 23 March 2026
  • Home  
  • 🔴 థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఆవిష్కరణ దినోత్సవం – ఎలక్ట్రీషియన్ డే గా వేడుకలు
- విశాఖపట్నం

🔴 థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఆవిష్కరణ దినోత్సవం – ఎలక్ట్రీషియన్ డే గా వేడుకలు

విశాఖపట్నం: జనవరి (పున్నమి ప్రతినిధి) నేటి ఆధునిక జీవనశైలికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన రోజు నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు. విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న ఎలక్ట్రీషియన్లకు గౌరవం తెలుపుతూ ఈ దినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించడం ద్వారా ప్రపంచానికే వెలుగు చూపించారు. ఆయన ఆవిష్కరణ మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అది బాటలు వేసిన చారిత్రక ఘట్టంగా నిలిచింది. విశాఖపట్నంలో కూడా ఈ సందర్భంగా పలు చోట్ల ఎలక్ట్రీషియన్లను సన్మానిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ సరఫరా, మరమ్మత్తులు, ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్ళు శ్రమించే ఎలక్ట్రీషియన్ల సేవలను పలువురు ప్రశంసించారు. విద్యుత్ రంగంలో వారి పాత్ర అమూల్యమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు ఎలక్ట్రీషియన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికతను అవలంబిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వెలుగులతో నింపిన ఎడిసన్ ఆవిష్కరణకు నివాళిగా – నేడు ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు.

విశాఖపట్నం: జనవరి (పున్నమి ప్రతినిధి)

నేటి ఆధునిక జీవనశైలికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన రోజు నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు. విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న ఎలక్ట్రీషియన్లకు గౌరవం తెలుపుతూ ఈ దినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించడం ద్వారా ప్రపంచానికే వెలుగు చూపించారు. ఆయన ఆవిష్కరణ మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అది బాటలు వేసిన చారిత్రక ఘట్టంగా నిలిచింది. విశాఖపట్నంలో కూడా ఈ సందర్భంగా పలు చోట్ల ఎలక్ట్రీషియన్లను సన్మానిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ సరఫరా, మరమ్మత్తులు, ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్ళు శ్రమించే ఎలక్ట్రీషియన్ల సేవలను పలువురు ప్రశంసించారు. విద్యుత్ రంగంలో వారి పాత్ర అమూల్యమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు ఎలక్ట్రీషియన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికతను అవలంబిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వెలుగులతో నింపిన ఎడిసన్ ఆవిష్కరణకు నివాళిగా – నేడు ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.