గుంటూరు జిల్లా సతెనపల్లికి చెందిన యువతి ప్రియాంక గారి జీవితం అనేక యువతకు ప్రేరణ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె, చిన్న ల్యాప్‌టాప్‌తోనే తన డిజిటల్ డ్రీమ్ ప్రారంభించింది. ప్రారంభంలో చిన్న వ్యాపారాల కోసం సోషల్ మీడియా పేజీలు సృష్టించడం, లోగోలు డిజైన్ చేయడం, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేసేది.
ఆమె కృషి, నిబద్ధత, సృజనాత్మకతతో తక్కువ సమయంలోనే కస్టమర్లు పెరిగి, పెద్ద కంపెనీలు కూడా సేవలు కోరడం ప్రారంభించాయి. ఇప్పుడు ప్రియాంక గారు “డిజిటల్ స్ఫూర్తి” అనే కంపెనీ స్థాపించి, 50 మందికి పైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చారు.
డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైన్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో ఆమె కంపెనీ దూసుకుపోతుంది. గ్రామంలో నుంచే ప్రపంచ మార్కెట్‌లో సేవలు అందించడం ద్వారా “లోకల్ టు గ్లోబల్” అనే నినాదాన్ని సాక్షాత్కరించారు.
తన మాటల్లో ప్రియాంక గారు చెబుతారు — “ఇంటర్నెట్ ఉన్నంత వరకు అవకాశాలు ఉన్నాయి; ధైర్యం ఉంటే ప్రతి ఊరి యువతీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వగలదు!”
🌟 ప్రేరణ: ఆలోచన ఉంటే అవకాశాలు వస్తాయి.
— పున్నమి తెలుగు డైలీ


