రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) నిధులు రూ.98.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్న భోజనంతోపాటు వంట ఖర్చు, గుడ్డు ధరకు సంబంధించి రూ.25.64 కోట్లు, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రూ.28.43 కోట్లు, వంట కార్మికుల గౌరవ వేతనం రూ.44.73 కోట్లు కలిపి మొత్తం రూ.98.3 కోట్లు విడుదల చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిధులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏప్రిల్, జూన్, జులై వరకు, వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు విడుదల చేశామని వివరించారు. వంట కార్మికుల గౌరవ వేతనం నెలకు రూ.రెండు వేలు చెల్లిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి చొప్పున నిధులను భరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్రంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే నిధులను భరించి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నది. ఇంటర్మీడియెట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్ ఉన్నది…

💰మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కోట్లు విడుదల* *విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్*