💥NTR జిల్లా గొల్లపూడిలోని GIG ఇంటర్నేషనల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకుని శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు, కానీ యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించింది.
సమాచారం అందుకున్న అయ్యప్ప మాల ధరించిన భక్తులు,ABVP, RSS కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
💥ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది.
💥 ఈ విషయమై డీఈవో సుబ్బారావు శుక్రవారం స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పాఠశాల యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఏదైనా ప్రైవేటు, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాల ధరించి వస్తే వారికి అభ్యంతరం తెలపకుండా తరగతి గదిలోకి అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


