తేదీ: 03-08-2025, ఆదివారం రోజు, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ బృందంగా కలిసి దేవి థియేటర్, జనగామలో ప్రదర్శితమైన “మహావతార్ నరసింహ” సినిమాను వీక్షించారు. ఈ చిత్రం అందరికీ ఆధ్యాత్మికంగా ప్రేరణనిచ్చింది.
నరసింహస్వామి అవతారంలో ధర్మ పరిరక్షణ కోసం జరిగే సంఘర్షణ, భక్తి, ధైర్యం పట్ల ఈ సినిమా అందించిన సందేశాలు ప్రతి విద్యార్థి హృదయంలో గాఢంగా నిలిచిపోయాయి. మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసిన ఈ చిత్రం మరువలేని అనుభూతిని అందించింది.
ఈ సందర్భంగా,
హరే కృష్ణ భక్తబృందం వారు హరినామ సంకీర్తన చేస్తూ, ఎంతో ఉత్సాహంగా సందడిగా నృత్య ప్రదర్శనను కూడా అందించారు. వారి భక్తి, పాటల మాధుర్యం మరియు నృత్యం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నాయి.
మేము, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ – జనగామ, ఈ చిత్రం నిర్మాణ బృందానికి, నటీనటులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి చిత్రాలు యువతలో సంస్కారాలను, భక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని మా నమ్మకం.


