నెల్లూరు అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో నూతనంగా DT&AO (FAC) బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయ శ్రీ బి. శ్రీనివాసులు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో, ప్రజా నిధుల పారదర్శక వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత ఆర్థిక నిర్వహణలో శ్రీనివాసులు గారు మరింత నూతన దిశలో ముందుకు తీసుకువెళతారని విశ్వసిస్తున్నాము. ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, ప్రజాసేవా తపన ఖజానా విభాగానికి మరింత బలం చేకూరుస్తుంది. ఖజానా సిబ్బంది తరఫున ఆయనకు ఈ కొత్త బాధ్యతలలో విజయం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ — జిల్లా ఖజానా వ్యవహారాలు మరింత చక్కగా సాగేలా ఆయన నాయకత్వం మార్గదర్శకంగా నిలుస్తుందని సిబ్బంది తెలిపారు


