*🇮🇳వందే మాతరానికి 150 ఏళ్లు ఒక సామాజిక పౌరుడిగా నా సందేశం*
ఈరోజు మన దేశానికి ఎంతో గౌరవదాయకమైన రోజు. మన స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి ఇచ్చిన, మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన “వందే మాతరం” గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ గారు రాశారు. ఆ రోజుల్లో ఈ పాటను పాడటం అంటే బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడటం. మన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరులు ఈ గేయాన్ని గట్టిగా పాడుతూ, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించారు. అందుకే ఈ రెండు పదాలు వందే మాతరం మనకెప్పుడూ గర్వకారణం.
ప్రభుత్వం ఈ శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 9:50కు మనమందరం ఒకేసారి వందేమాతరాన్ని పాడి, మన దేశానికి గౌరవం తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ప్రతీ కార్యాలయం, ప్రతీ పాఠశాల, ప్రతీ గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన గ్రామం నుండి మనమూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాము అనేది చాలా ఆనందకరం.
మన భారత దేశం మన తల్లి. ఆమె మనకు అన్నీ ఇచ్చింది నేల, నీరు, గాలి, సంస్కృతి, గౌరవం. అలాంటి తల్లికి వందనము చేసే పుణ్యక్షణం ఇది. వందే మాతరం అంటే “ఓ తల్లీ,
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల, కార్యాలయాల్లో తెలంగాణవందేమాతరం గీత ఆలాపన.
ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వందేమాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు.


