ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

🇮🇳*నాయుడుపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిన కూటమి నాయకులు, జనసైనికులు*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
🇮🇳*నాయుడుపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిన కూటమి నాయకులు, జనసైనికులు*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • *నాయుడుపేట, ఆగస్టు 14, 2026:* భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, నాయుడుపేట పట్టణంలో *“హర్ ఘర్ తిరంగా ర్యాలీ”* ఘనంగా నిర్వహించారు.
  • జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనున్నారు.
  • సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు *డా.

*నాయుడుపేట, ఆగస్టు 14, 2026:*

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, నాయుడుపేట పట్టణంలో *“హర్ ఘర్ తిరంగా ర్యాలీ”* ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనున్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు *డా. నెలవల విజయశ్రీ గారి* ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం గాంధీ మందిరం నుంచి బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని దేశభక్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో *నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు* పాల్గొని జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

ర్యాలీ సందర్భంగా *“వందేమాతరం”, “భారత్ మాతాకీ జై”* వంటి నినాదాలతో నాయుడుపేట పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత స్ఫూర్తిని మరింత పెంపొందించింది.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు, జనసేన నాయకులు బాలు శెట్టి, చరణ్, కుమార్, జ్యోతిష్, దినేష్, మరియు వీర మహిళలు రోహిణి, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పట్టణ పౌరులు తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *