உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
திருப்பதி

✍️*గురు పూర్ణిమ సందర్భంగా ఏకం క్షేత్రంలో భక్తుల వెల్లువ.. ముక్తి గురు శ్రీ కృష్ణాజీ దర్శనానికి పోటెత్తిన జనసంద్రం**

புன்னமி செய்தியறை வெளியீடு:
✍️*గురు పూర్ణిమ సందర్భంగా ఏకం క్షేత్రంలో భక్తుల వెల్లువ.. ముక్తి గురు శ్రీ కృష్ణాజీ దర్శనానికి పోటెత్తిన జనసంద్రం**

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ✍️నారాయణవనం: గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మ భగవాన్ ఏకం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
  • ఎట్టకేలకు ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ప్రత్యక్ష దర్శనం కల్పించడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు ఆశ్రమానికి తరలివచ్చారు.
  • స్థానిక భక్తులు సైతం భారీ సంఖ్యలో పాల్గొని గురుదర్శనం చేసుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

✍️నారాయణవనం: గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మ భగవాన్ ఏకం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఎట్టకేలకు ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ప్రత్యక్ష దర్శనం కల్పించడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు ఆశ్రమానికి తరలివచ్చారు. స్థానిక భక్తులు సైతం భారీ సంఖ్యలో పాల్గొని గురుదర్శనం చేసుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

✍️ఇంతకాలంగా నిశ్శబ్దంగా కనిపించిన ఏకం క్షేత్రం, శ్రీ కృష్ణాజీ దర్శనాలతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ భక్తుల రద్దీతో సందడిగా మారింది.

✍️పాలరాతితో నిర్మించిన అద్భుతమైన ఏకం క్షేత్రంలో గురు పూర్ణిమ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చెన్నైకి, తిరుపతికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి దాదాపు 50 వేల మంది భక్తులు విచ్చేసి ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ఇచ్ఛా సిద్ధి ఆశీర్వాదాలను పొందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకే సుమారు 10 వేల మంది భక్తులు గురుదర్శనం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

✍️ఆశ్రమ ప్రాంగణం అంతా హిందూ భజనలు, వేద మంత్రోచ్ఛారణలు, యజ్ఞాల పవిత్ర అగ్నితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాశి వనంలో భక్తులు రాశి దోష నివారణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ రాశి దేవతల ఆశీర్వాదాలను కోరుకున్నారు.

✍️చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చిన కీర్తన బృందాలు రోజంతా భక్తి గీతాలతో అలరించగా, మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర ఆలయం నుంచి వచ్చిన నాసిక్ ఢోల్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుల నినాదాలు, జయజయధ్వానాలతో ఆశ్రమం మార్మోగింది. స్థానిక గ్రామస్తులు పండరి భజనలు, కోలాటాలతో వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

✍️ముక్తి గురు శ్రీ కృష్ణాజీ సాంప్రదాయ పీఠంపై మౌనంగా ఆసీనులై వరుసలుగా వస్తున్న భక్తులను ఆశీర్వదించారు. వాలంటీర్లు క్రమబద్ధంగా దర్శన ఏర్పాట్లు నిర్వహించడంతో భక్తులు ప్రశాంతంగా గురుదర్శనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

✍️భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయగా, వాలంటీర్ సేవా బృందాలు రోజంతా సేవలందించాయి. సాయంత్రం ఆనంద తన్మయ కార్యక్రమాలతో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *