అంబేద్కర్ కోనసీమ సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి)
డా’ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ చురుకుగా దోపిడీలు, దాడులకు పాల్పడుతోంది. గ్రామ శివారు ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు వెల్లడించారు. రాత్రి సమయంలో తలుపు తడితే తీయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇళ్లు ఖాళీగా వదిలి వెళ్లే ముందు పోలీసులకు తెలపాలని, తద్వారా నైట్ బీట్ ద్వారా చెకింగ్ చేపడతామని తెలిపారు. లాడ్జ్ యజమానులు కూడా అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయాలన్నారు. రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ప్రాంతాల్లో దొంగతనాల ప్రమాదం ఉందని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ హెచ్చరించారు.


