ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జీ )
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు విద్యలోనే కాకుండా సాంస్కృతిక విలువలను కూడా అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.


