Thursday, 5 February 2026
  • Home  
  • హైదరాబాద్ ghmc ఆఫీస్ అవినీతికి నిలయం పనిచేయని లిప్ట్ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తం బల్దియా అంటేనే అవినీతి కంపు..!* *ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు
- E-పేపర్

హైదరాబాద్ ghmc ఆఫీస్ అవినీతికి నిలయం పనిచేయని లిప్ట్ పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తం బల్దియా అంటేనే అవినీతి కంపు..!* *ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ జీహెచ్ఎంసీ ఆఫీస్ అవినీతికి నిలయం పనిచేయని లిఫ్ట్ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం బల్దియా అంటేనే అవినీతి కంపు ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు పక్కదారి పడుతున్న మెయింటెనెన్స్ నిధులు జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి కంపు రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో కాలనీలను, డివిజన్ లను శుభ్రపరిచే బల్దియానే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో చెత్తా చెదారంతో నిండిపోతుంది. అదెక్కడో కాదు.. సరూర్ నగర్ పరిధిలో ఉన్న సర్కిల్ 3- 4- 5 కార్యాలయమే ఇందుకు నిదర్శనం. ఇక్కడికి స్థానిక ప్రజలు అనేక పనులపై వస్తుంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో వికలాంగులకు, వృద్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడి దుస్థితి చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. తమ కార్యాలయంలో ఓ లిఫ్టును కూడా బాగు చేసుకోలేని వాళ్లు.. తమ ఆఫీసును కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోలేని అధికారులు ఇక వాళ్ల పరిధిలోని కాలనీలను, డివిజన్ పరిధిలోని బస్తీలను ఎలా పరిశుభ్రంగా ఉంచుతారనే చర్చ మొదలైంది.. *పని చేయని లిఫ్ట్* జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో గత ఏడాది కాలంగా లిఫ్ట్ పని చేయడం లేదు. దీంతో అనేక పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు లిఫ్ట్ పని చేయకపోవడంతో రెండవ, మూడవ అంతస్తులోని కార్యాలయాల్లోకి తమ పనుల నిమిత్తం వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా మరమ్మత్తులు ఉంటే.. వారం.. పది రోజుల్లో పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయింటెనెన్స్ నిధులు ఏమైతున్నట్టు ప్రభుత్వం ముఖ్యంగా జీహెచ్ఎంసీ నిధుల నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయాలకు మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ ను ప్రతినెలా రిలీజ్ చేస్తుంది. అట్లాగే సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు వేళల్లో కాదు.. రూ. లక్షల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి. ఏడాదికాలంగా వృద్ధులు, వికలాంగులు సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఈ పక్క దారి పట్టిన నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి..? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను గ్రహించి.. మెయింటెనెన్స్ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సరూర్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్
జీహెచ్ఎంసీ ఆఫీస్ అవినీతికి నిలయం
పనిచేయని లిఫ్ట్
పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం
బల్దియా అంటేనే అవినీతి కంపు
ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు
పక్కదారి పడుతున్న మెయింటెనెన్స్ నిధులు
జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి కంపు రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో కాలనీలను, డివిజన్ లను శుభ్రపరిచే బల్దియానే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో చెత్తా చెదారంతో నిండిపోతుంది. అదెక్కడో కాదు.. సరూర్ నగర్ పరిధిలో ఉన్న సర్కిల్ 3- 4- 5 కార్యాలయమే ఇందుకు నిదర్శనం. ఇక్కడికి స్థానిక ప్రజలు అనేక పనులపై వస్తుంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో వికలాంగులకు, వృద్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడి దుస్థితి చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. తమ కార్యాలయంలో ఓ లిఫ్టును కూడా బాగు చేసుకోలేని వాళ్లు.. తమ ఆఫీసును కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోలేని అధికారులు ఇక వాళ్ల పరిధిలోని కాలనీలను, డివిజన్ పరిధిలోని బస్తీలను ఎలా పరిశుభ్రంగా ఉంచుతారనే చర్చ మొదలైంది..
*పని చేయని లిఫ్ట్*
జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో గత ఏడాది కాలంగా లిఫ్ట్ పని చేయడం లేదు. దీంతో అనేక పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు లిఫ్ట్ పని చేయకపోవడంతో రెండవ, మూడవ అంతస్తులోని కార్యాలయాల్లోకి తమ పనుల నిమిత్తం వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా మరమ్మత్తులు ఉంటే.. వారం.. పది రోజుల్లో పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెయింటెనెన్స్ నిధులు ఏమైతున్నట్టు
ప్రభుత్వం ముఖ్యంగా జీహెచ్ఎంసీ నిధుల నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయాలకు మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ ను ప్రతినెలా రిలీజ్ చేస్తుంది. అట్లాగే సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు వేళల్లో కాదు.. రూ. లక్షల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి. ఏడాదికాలంగా వృద్ధులు, వికలాంగులు సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఈ పక్క దారి పట్టిన నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి..? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను గ్రహించి.. మెయింటెనెన్స్ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సరూర్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.