పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హైదరాబాద్ మెట్రో నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి దశను ప్రారంభించగా, 29 నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 రైళ్లు, దాదాపు 1,100 ట్రిప్పులతో రోజూ 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మెట్రో విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.


