పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఎన్నికల ప్రచార సమయములో నాయకుల మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణగా మారింది. భవాని శంకర్ వర్గం, నవీన్ యాదవ్ వర్గాల మధ్య తలపడ్డ ఈ ఘర్షణ ర్యాలీ సమయంలో చోటుచేసుకుంది. రెసిడెన్స్ హాలులో జరిగిన ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగినట్లు సమాచారం. భవాని శంకర్ వర్గం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉందని, ఇది పాత వర్గ విభేదాల కొనసాగింపేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు.


