పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మామిడిపల్లి గ్రామంలో 50 ఎకరాల భూభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని తెలిసి ఆ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మొదటిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని, పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని, రంగనాయకుల స్వామి ఆలయాన్ని సందర్శించి హిందూ బంధువులు అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ ఈ భూమిలో అనేక ఆలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయని నియోజకవర్గ హక్కులకు సంబంధం లేని, హైదరాబాద్ జిల్లాకు చెందిన మైనారిటీ స్కూల్‌ను ఇక్కడ ఎందుకు నిర్మించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వానికి చాలానే ఖాళీ స్థలాలు ఉన్నాయని అవన్నీ వదిలి మహేశ్వరంకి వచ్చి ఇక్కడ నిర్మించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దేవాలయ భూములను ఇండస్ట్రీలకు నిర్బంధంగా ఇచ్చేశారు; కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఒక్క గజం భూమి కూడా ఇవ్వలేదు అని గుర్తు చేశారు. సూర్యగిరి ఎల్లమ్మతల్లి ఆలయానికి ఇంతవరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, హిందువుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయే పరిస్థితిని సబితా ఇంద్రారెడ్డి తెచ్చారన్నారు. “హిందూ దేవాలయ భూములను పట్టించుకోని ప్రభుత్వం, హామీ చేసిన అభివృద్ధి పనులన్నీ మధ్యలో ఆపేసి, కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అవసరం లేని పనులు మాత్రమే చేస్తోంది. ఇది మహేశ్వరం ప్రజలపై అన్యాయం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణాన్ని అనుమతించము. ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమై వారి అభ్యంతరాలను విన్నారు.ఇది నియోజకవర్గం గౌరవానికి, ప్రజల హక్కులకు జరిగిన దాడి. మహేశ్వరంలో హిందువుల, దేవాలయాల భూములను రక్షించడం మా బాధ్యత. ఈ విషయంపై పోరాటానికి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు” అని స్పష్టం స్పష్టం చేసి స్థానికులకు మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*హైదరాబాద్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలకు మా మహేశ్వరం భూములు ఎందుకు.! –బి ఆర్ ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో పాతబస్తీగా మారుస్తున్నారు – శ్రీరాములు అందెల*