పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనేందు కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో బేగం పేట విమానాశ్రయం లో దిగిన ఆయనకి బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రేపు ఉదయం 8.30 నిముషాలకీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొంటారు.


