హైడ్రో పవ అనంతగిరి (పున్నమి), అక్టోబర్ :19
గుజ్జేలి హైడ్రోపార్ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యతిరేక కమిటీ ఆధవర్యంలో అనంతగిరి మండలం గుమ్మకోట లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య వక్త గా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి హజరై మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల వలన ఆదివాసీలకు కలిగే ప్రయోజనం ఏమి లేదని, ప్రాజక్టులతో గిరిజన ప్రాంతాన్నిశజల సమాధి చెయ్యవద్దని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అటవీ పర్యావరణ అనుమతులు జిఓ నెంబర్ 51,13, 2 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం నిర్మించి కొనసాగిస్తున్న సీలేరు, మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రాల వలన ఎంత మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామి ప్రకారం జీవో నెం. 3ని పుణరుద్దరించి స్ధానిక గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పాచిపెంట అప్పలనరస, పొద్దు బాలదేవ్, టోకూరు సర్పంచ్ కిల్లో మొస్య తదితరులు పాల్గొన్నారు.

హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా గుమ్మకోట లో బహిరంగ సభ ప్రాజెక్ట్ లను, జీవో నెం. 2,13,51లను రద్దు చేయాలని గిరిజనుల డిమాండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో గిరిజన ప్రాంతం జల సమాధి చేయొద్దు: సీపీఎం కేందర కమిటీ సభ్యులు పుణ్యావతి
హైడ్రో పవ అనంతగిరి (పున్నమి), అక్టోబర్ :19 గుజ్జేలి హైడ్రోపార్ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యతిరేక కమిటీ ఆధవర్యంలో అనంతగిరి మండలం గుమ్మకోట లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య వక్త గా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి హజరై మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల వలన ఆదివాసీలకు కలిగే ప్రయోజనం ఏమి లేదని, ప్రాజక్టులతో గిరిజన ప్రాంతాన్నిశజల సమాధి చెయ్యవద్దని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అటవీ పర్యావరణ అనుమతులు జిఓ నెంబర్ 51,13, 2 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం నిర్మించి కొనసాగిస్తున్న సీలేరు, మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రాల వలన ఎంత మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామి ప్రకారం జీవో నెం. 3ని పుణరుద్దరించి స్ధానిక గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పాచిపెంట అప్పలనరస, పొద్దు బాలదేవ్, టోకూరు సర్పంచ్ కిల్లో మొస్య తదితరులు పాల్గొన్నారు.

