*హిందీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలి*
*పున్నమి ప్రతినిధి వనపర్తి *జిల్లా తేదీ::19/01/ 2026*
*ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలం యందు హిందీ ఏడవ తరగతి పాఠశాల తరగతి గదిలో హిందీ భాష నైపుణ్యాలు మరియు అభ్యసన సామర్ధ్యాల ప్రక్రియను డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ విద్యార్థులకు సూచనలు ఇస్తు ఉపాధ్యాయులు హిందీ భాష నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే భాషా నైపుణ్యాలు మిగతా తరగతి అంశాలు సరళంగా అర్థం అవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు హిందీ జాతీయ భాష, సరళ భాష అని ఇది ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థుల కోసం అనేక అభ్యసన ప్రక్రియలు టిఎల్ఎం ప్రయోగాల ద్వారా శ్రీనివాస చారి గారి బోధన ప్రశంసనీయం అభినందనీయమని వారు అభినందించారు*


