*24 గంటల్లో బోరు వేయిస్తామని మాయ మాటలు చెప్పి తప్పించుకున్న ఎమ్మెల్యే!*
*72 గంటల్లో బోరు వేయించి మాట నిలబెట్టుకున్న బంటన్న!!*
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు, ఇంద్రానగర్ కాలనీ వాసులు — మాజీ ఎమ్మెల్యే *మంచిరెడ్డి కిషన్ రెడ్డి*అన్ని మౌలిక వసతులు కల్పించారని, కేవలం తాగునీటి బోరు ఒక్కటే అవసరమని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ని సంప్రదించారు.
24 గంటల్లో బోరు వేయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాటను నిలబెట్టుకోకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర నిరాశతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)* ని కలిసి తమ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ప్రశాంత్ రెడ్డి గారు బోరు బండిని పంపించి, పనులు ప్రారంభింపజేసి — నీరు వచ్చే వరకు నిరంతరం కొనసాగించారు.
ఈ సందర్భంగా నీరు పడటంతో కాలనీ వాసులు ప్రశాంత్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ —
“హామీలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చడమే అసలైన ప్రజాసేవ” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జెర్కొని రాజు, మాజీ కౌన్సిలర్లు మంద సుధాకర్, శంకర్ నాయక్, వార్డు అధ్యక్షులు నౌసు శివ, కొండ్రు మురళీ కృష్ణ, చింతపట్ల ఉదయ్, డోంకి చందు,కొండ్రు మహేష్, జలేందర్ నాయక్, సురేష్, కొండ్రు రవి కాలనీ వాసులు ఆలంపల్లి బాబు, కందుకూరి శ్రీనివాస్,కప్పటి నర్సింగ్ రావు, ఆలంపల్లి బాషా, కందుకూరి బాలు, గోరేమియా, డాక్టర్ ప్రభాకర్ సర్, పెద్ద ఎత్తున పాల్గొన్నారు



