Wednesday, 1 April 2026
  • Home  
  • “హలో మాదిగ… చలో ఢిల్లీ” – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ
- నిర్మల్

“హలో మాదిగ… చలో ఢిల్లీ” – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, అస్తిత్వం మరియు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం దేశవ్యాప్తంగా దళితులు ఏకం కావాల్సిన అవసరం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దాడిని నిరసిస్తూ నవంబర్ 17న ఢిల్లీలో నిర్వహించనున్న “చలో ఢిల్లీ – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన”ను విజయవంతం చేయాలని ఆయన దళితులను ఆహ్వానించారు. దక్షిణ భారత బలహీన వర్గాల ఐక్యత బలపడాలని, సామాజిక న్యాయం సాధించడానికి ఇది కీలక సమయం అని మందకృష్ణ మాదిగ తెలిపారు. “నిర్మల్ జిల్లా నుంచి MRPS నాయకులు కత్తెరపాక శంకర్, రాజన్న, శనిగారపు రవి, కొలగని రాజు, నమాత్కర్ లక్ష్మన్, పత్రి వెంకటరమణ తదితరులు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొనడానికి బయలుదేరారు.” MRPS నేత కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ జస్టిస్ గవాయి‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతంపై దాడి కాదు, అది దళిత గౌరవం మీద దాడి అని పేర్కొంటూ, హక్కుల కోసం ఈ ఉద్యమం కీలక మలుపు అవుతుందని తెలిపారు.

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, అస్తిత్వం మరియు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం దేశవ్యాప్తంగా దళితులు ఏకం కావాల్సిన అవసరం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దాడిని నిరసిస్తూ నవంబర్ 17న ఢిల్లీలో నిర్వహించనున్న “చలో ఢిల్లీ – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన”ను విజయవంతం చేయాలని ఆయన దళితులను ఆహ్వానించారు. దక్షిణ భారత బలహీన వర్గాల ఐక్యత బలపడాలని, సామాజిక న్యాయం సాధించడానికి ఇది కీలక సమయం అని మందకృష్ణ మాదిగ తెలిపారు. “నిర్మల్ జిల్లా నుంచి MRPS నాయకులు కత్తెరపాక శంకర్, రాజన్న, శనిగారపు రవి, కొలగని రాజు, నమాత్కర్ లక్ష్మన్, పత్రి వెంకటరమణ తదితరులు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొనడానికి బయలుదేరారు.”
MRPS నేత కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ జస్టిస్ గవాయి‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతంపై దాడి కాదు, అది దళిత గౌరవం మీద దాడి అని పేర్కొంటూ, హక్కుల కోసం ఈ ఉద్యమం కీలక మలుపు అవుతుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.